ఎయిర్ షోపై 'వెదర్' ఎఫెక్ట్ వుండదు!
- November 14, 2018బహ్రెయిన్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ షోపై వెదర్ ఎఫెక్ట్ ఏమీ వుండకపోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మెటియరాలజికల్ డైరెక్టరేట్, వాతావరనణం ఆహ్లాదంగా వుంటుందని ఇప్పటికే సంకేతాలు పంపింది. సాధారణ గాలులు వీచే అవకాశం వుందనీ, అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం వుందని మెటియరాలజికల్ డైరెక్టరేట్ పేర్కొంది. రానున్న వారం రోజుల్లోనూ వాతావరణం ఆహ్లాదకరంగానే వుంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెంటిగ్రేడ్‌గానూ, అత్యల్ప ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గానూ రికార్డ్ అయ్యే అవకాశం వుంది. హ్యుమిడిటీ 35 శాతం నుంచి 85 శాతం వరకు వుండొచ్చు. ఇదిలా వుంటే, శుక్రవారం వరకు ఎయిర్ షో సఖిర్ ఎయిర్ బేస్‌లో కొనసాగనున్న సంగతి తెల్సిందే. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..