స్మోక్ డిటెక్టర్స్, ఫైరల్ అలార్మ్స్ ఇకపై తప్పనిసరి
- November 14, 2018
వచ్చే ఏడాది నుంచి ఇండస్ట్రియల్, కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కి షార్జాలో స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ తప్పనిసరి. విల్లాస్ మరియు ప్రైవేట్ హౌస్‌లకు మాత్రం, ఇది ఆప్షనల్. కాగా, భవనాల ఓనర్లకు ఇప్పటికే స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. షార్జా ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ అథారిటీ అలాగే సానిద్, ఎప్పటికప్పుడు ఈ స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్‌కి సంబంధించి భవనాల యజమానుల్ని అప్రమత్తం చేయనున్నాయి. ఎస్‌పిఎస్‌ఎ డైరెక్టర్ షేక్ సైఫ్ మొహమ్మద్ అల్ కాసిమి మాట్లాడుతూ, తనిఖీలు అన్ని భవనాల్లోనూ జరుగుతాయని చెప్పారు. ఎస్‌పిఎస్‌ఎ, కంపెనీ స్టాఫ్ అలాగే స్టేక్ హోల్డర్స్‌కి ఫైర్ ప్రివెన్షన్‌పై శిక్షణ ఇప్పించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ తరహా ట్రెయినింగ్ కోసం కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి శిక్షణ ఇప్పించేందుకు 250 దిర్హామ్‌లు వసూలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







