'కాంచన3'వస్తుంది!
- November 17, 2018
టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్,థ్రిల్లర్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు లారెన్స్. చిన్న కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలు పెట్టిన లారెన్స్ తర్వాత నటుడిగా మారాడు. 'స్టైల్'సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్ తర్వాత కొన్ని సినిమాలు తీసినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దాంతో హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ లో 'ముని'సినిమా తీశాడు. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించడమే కాదు హర్రర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది.
ముని సినిమాకు సీక్వెల్ గా కాంచన, గంగా సినిమాలు తీసి సూపర్ సక్సెస్ పొందారు లారెన్స్. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ఈ సినిమాలు ఇతర భాషల్లో కూడా రిమెక్ లు అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ కి తిరుగేలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమాలు సూపర్ హిట్ కావడమే కాదు భారీ వసూళ్లు కూడా రాబట్టాయి. తాజాగా 'కాంచన3'సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా వచ్చే వేసవికి ప్రేక్షకులకు ముందుకు రానుందనేది తాజా సమాచారం. లారెన్స్ కథానాయకుడిగా .. ఆయన సరసన వేదిక - ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సారి కూడా కొత్త కాన్సెప్ట్ తో మరింత భయపెడుతూ..నవ్వించబోతున్నాడట లారెన్స్. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది. ఈ సారి లారెన్స్ ఏ రేంజ్ లో భయపెడతాడో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







