‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ మూవీ రివ్యూ

‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ మూవీ రివ్యూ

విడుదల తేదీ : నవంబర్ 16, 2018
నటీనటులు : రవితేజ, ఇలియాన, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాత : నవీన్ యర్నెని, వై రవి శంకర్ , సివియమ్.
సంగీతం : యస్ తమన్
స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల

కథ:

రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ మంచి ఫ్రెండ్స్. వ్యాపారంలో ఎదిగిన వీరు బంధుత్వంలోనూ కలవాలనుకుంటారు. అమర్ , ఐశ్వర్య కు పెళ్ళి చేయాలనుకుంటారు. కానీ పార్టనర్స్ చేసిన నమ్మక ద్రోహం అమర్, ఐశ్వర్యపేరేంట్స్ ప్రాణాలు తీస్తుంది. వీరిని విడదీస్తుంది. అమర్ ని జైల్ కి పంపిస్తుంది. బయటకి వచ్చిన అమర్ తన పగను వెతుక్కుంటూ బయలు దేరతాడు. అమర్, ఐశ్వర్య లు ఒక డిజార్డర్ తో బాధ పడుతుంటారు. అమర్ కోసం ఐశ్వర్య ఎదరుచూస్తుంటే, ఐశ్వర్య చనిపోయిందని అమర్ అనుకుంటాడు. మరి వీరి పగ ఎలా నెరవేరింది..? వీరు ఎలా కలిసారు..? అనేది మిగిలిన కథ..?

కథనం:

రివైంజ్ కథలు ఎప్పుడూ బోరు కొట్టవు.. వాటి ఎమోషన్ ని సరిగ్గా ట్రిగ్ చేయగలిగితే. పాతాళ భైరవి నుండి బాహుబలి వరకూ ఆ పగే వెండతెరపై కలెక్షన్స్ ని కురిపించింది. అలాంటి పగనే అమర్‌ అక్బర్‌ ఆంటొని అందించింది. ఆ కథ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నుండీ ప్రేక్షకులకు తెలిసిన కథే. తన ప్యామిలీను మోసం తో చంపేసిన వారిని తిరిగి చంపడం.. దానికి హీరో పెట్టుకున్న కొత్త పేరు రిటర్న్ గిప్ట్. కథ మొదలైన పదినిమిషాలకు క్లైమాక్స్ ఊహించేంత.. అలవాటయిన కథలో కథనం కూడా అంతే తెలిసింది కావాడమే ప్రేక్షకులకు మరింత పరీక్ష పెట్టింది. హీరో ఒక్కోక్కరినీ టార్గెట్ చేసి చంపుతాడు.. ఈ పాయింట్ నుండి మొదలైతే హీరో చేసిన మొదటి హత్యే చాలా పేలవంగా మారింది. అందులో ఏమాత్రం ఎగ్జైట్‌మెంట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఇక రెండో క్యారెక్టర్ మొదలయ్యే సరికి ప్రేక్షకులకు మరో కన్ ఫ్యూజన్ మొదలవుతుంది. అమర్ అక్బర్ గా వచ్చాడా లేదా అతను ఇతను వేరా అని.. లేదు అమరే అక్బర్ గా వచ్చాడు అని ఫిక్స్ అయ్యే లోపు ఆంటోని గా మారతాడు. అది కూడా అతని ప్లాన్ లో బాగం అని సరిపెట్టుకునే లోపు.. హీరోలో ఏదో డిజార్డర్ ఉందనే హింట్ ఇచ్చాడు దర్శకుడు. మరో వైపు ‘వాటా’ పేరుతో ‘నమో వెంకటేశా’లో పాత ట్రాక్ ని కొత్త గా క్యారెక్టర్స్ తో కామెడీ చేయడం మొదలవుతుంది.

ఇందులో వెన్నెల కిషోర్, రఘబాబు, శ్రీనివాసరెడ్డి తమ అనుభవం మేరకు నవ్వించారు. కొన్నిసార్లు నిజంగానే నవ్వు వచ్చింది. వీరి ట్రాక్ ని పీక్స్ లోకి తీసుకెళ్ళాడు సత్య. కె.ఎ. పాల్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఫన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. చేతబడి కాన్సెప్ట్ తో సన్నివేశాలు, సత్య బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఎఫ్.బి.ఐ ఆఫీసర్ గా అభిమన్యు సింగ్ అతనికి అసిస్టెంట్ గా చేసిన రవి ప్రకాష్ క్యారెక్టర్స్ చూస్తుంటే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. ఎంత సినిమా లిబర్టీ తీసుకున్నా ఇంత దారుణమైన క్యారెక్టర్స్ ని ఇంత వరకూ చూడలేదు.

ఇక విలన్స్ ని చంపడం కూడా ఏమాత్రం ఎగ్జైట్‌మెంట్ ని కలిగించలేదు. దీంతో సీరియస్ రివైంజ్ డ్రామాగా మొదలైన కథ లో కామెడీ డామినేట్ చేసి, డిజార్డర్స్ తో ట్రాక్ పట్టించి ఎంత గందరగోళం గా చేసాడు దర్శకుడు. ఇక ఇలియానా ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా అనిపించుకునేంత సినిమా మాత్రం కాదు. తన పాత్రకు ఇంపార్టెంట్ ఉన్నా, తెరమీద మాత్రం అంత ఆకట్టుకోలేదు. ఒక డిజార్డర్ తో బాధ పడటం, హీరో కోసం ఎదురు చూడటం తప్ప ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేదు. డాన్ బోస్క్ పాట బాగుంది. ఇక అమర్, అక్బర్, ఆంటొనీ గా రవితేజ నటన ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్స్ తో కన్ ప్యూజ్ అవడం ప్రేక్షకులకు కూడా అనుభవంలోకి వస్తుంది. ఇక అందరూ చాలా సార్లు చూసిన ప్లాష్ బ్యాక్ కు అన్ని లేయర్స్ లో చెప్పడంతో సినిమాలో ప్లాష్ బ్యాక్ లు ఎక్కువ అయ్యాయి.

ఏ మాత్రం ఆసక్తిని, కలిగించని ఈ రివైంజ్ డ్రామా ప్రేక్షకుల మీద రివైంజ్ లా అనిపించింది. మారుతున్న కథలను కథనాలను పట్టించుకోకుండా తన థోరణి లో దర్శకుడు ఉండిపోయాడు అనిపించింది. కాసేపు నవ్వుకోవడానికి థియేటర్ కి ప్రేక్షకులు రావడం లేదని విషయం దర్శకుడు పెద్దగా పట్టించుకోవలేదు. వచ్చిన వాళ్లు కొన్ని సన్నివేశాలకు నవ్వుకోవచ్చు కానీ ఆ నవ్వుల కోసం థియేటర్స్ వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండరు. సింపుల్ రివైంజ్ డ్రామా లో కామెడీని డిజార్డర్స్ ని మిక్స్ చేసిన దర్శకుడు ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టాడు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ విలువలు సినిమాను గ్రాండ్ గా ప్రజెంట్ చేసాయి.

చివరిగా:
ప్రేక్షకుల సహానానికి పరీక్షగా మారిన అమర్ అక్బర్ ఆంథోని

Back to Top