కార్మికుల కోసం 'డు' ఔట్‌డోర్‌ సినిమా

- December 22, 2015 , by Maagulf
కార్మికుల కోసం 'డు' ఔట్‌డోర్‌ సినిమా

యూఏఈ కార్మికుల కోసం 'డు' ఔట్‌ డోర్‌ సినిమా అనుభవాన్ని పంచేందుకు ఏర్పాట్లు చేసింది. ఔట్‌ డోర్‌లో స్క్రీన్లు ఏర్పాటు చేసి, వాటిపై సినిమాల్ని ప్రదర్శించనుంది 'డు' సంస్థ. అబుదాబీలోని అల్‌ సలామ్‌ లివింగ్‌ సిటీ, సోనాపూర్‌ దుబాయ్‌, డుల్‌స్కో విలేజ్‌ ఇన్‌ అల్‌ కోజ్‌ దుబాయ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో కార్మికులకు వినోదాన్ని పంచేందుకు సినిమాల్ని ఔట్‌ డోర్‌లో ప్రదర్శిస్తారు. డిసెంబర్‌ 23, 31లో సోనాపూర్‌ దుబాయ్‌, అల్‌ కోజ్‌ దుబాయ్‌, జబెల్‌ అలి దుబాయ్‌, అల్‌ రయాన్‌ అబుదాబీ, సలామ్‌ సిటీ అబుదాబీ, మరియు షార్జా సజ్జాల్లో ఈ ప్రదర్శనలుంటాయి. 'డు' సంస్థ బ్రాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హలా బద్రి మాట్లాడుతూ, ఈ డిసెంబర్‌ కార్మికులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తనుందనీ, దుబాయ్‌ అభివృద్ధిలో అలుపెరుగకుండా శ్రమిస్తున్నవారికి ఆనందాన్ని పంచడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com