కార్మికుల కోసం 'డు' ఔట్‌డోర్ సినిమా
- December 22, 2015
యూఏఈ కార్మికుల కోసం 'డు' ఔట్ డోర్ సినిమా అనుభవాన్ని పంచేందుకు ఏర్పాట్లు చేసింది. ఔట్ డోర్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి, వాటిపై సినిమాల్ని ప్రదర్శించనుంది 'డు' సంస్థ. అబుదాబీలోని అల్ సలామ్ లివింగ్ సిటీ, సోనాపూర్ దుబాయ్, డుల్స్కో విలేజ్ ఇన్ అల్ కోజ్ దుబాయ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో కార్మికులకు వినోదాన్ని పంచేందుకు సినిమాల్ని ఔట్ డోర్లో ప్రదర్శిస్తారు. డిసెంబర్ 23, 31లో సోనాపూర్ దుబాయ్, అల్ కోజ్ దుబాయ్, జబెల్ అలి దుబాయ్, అల్ రయాన్ అబుదాబీ, సలామ్ సిటీ అబుదాబీ, మరియు షార్జా సజ్జాల్లో ఈ ప్రదర్శనలుంటాయి. 'డు' సంస్థ బ్రాండ్ అండ్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హలా బద్రి మాట్లాడుతూ, ఈ డిసెంబర్ కార్మికులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తనుందనీ, దుబాయ్ అభివృద్ధిలో అలుపెరుగకుండా శ్రమిస్తున్నవారికి ఆనందాన్ని పంచడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









