డయాబెటిక్స్‌కి ఉచిత మందులు
- November 19, 2018
ఉమ్ అల్ ఖువైన్ ఛారిటీ అసోసియేషన్, 78,300 దిర్హామ్‌ల విలువైన మందుల్ని తక్కువ ఆదాయం కలిగిన డయాబెటిక్ పేషెంట్స్‌కి అందించడం జరిగింది. వీరిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. జనవరి 1 నుంచి నవంబర్ 18 వరకు వీరికి నెలవారీగా అవసరమైన మందుల్ని అందిస్తూ వస్తున్నారు. అసోసియేషన్ డైరెక్టర్ ఇస్సా అలి బుల్‌హెల్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో వుండి సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా సాయం చేస్తున్నట్లు చెప్పారు. డయాబెటిస్ వ్యాధికి మందులు ఖరీదైనవి ఉపయోగించాల్సి రావడం, ఈ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి పేషెంట్లు వెళ్ళిపోతుండడంతో వారికి మందులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బుల్‌హెల్ చెప్పారు. సొసైటీ ఛైర్మన్ షేక్ మర్వాన్ బిన్ రషీద్ అల్ ముల్లా మాట్లాడుతూ, డయాబెటిక్ కేసుల్ని జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఇదిలా వుంటే, చలికాలం కావడంతో 200 లో ఇంకమ్ గ్రూప్ కుటుంబాల్ని గుర్తించి, వారికి వింటర్ క్లోత్స్‌ని అందిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







