భువనగిరిలో 'మల్లేశం' సినిమా షూటింగ్
- November 19, 2018
భువనగిరి(యాదాద్రి): ఆసుయంత్రం కనుగొనేందుకు చింతకింది మల్లేశం పడిన శ్రమ ఆధారితంగా నిర్మితమవుతున్న 'మల్లేశం' బయోపిక్ సినిమాలోని సన్నివేషాలను ఆదివారం భువనగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. సినిమా రెండో షెడ్యూల్‌లో భాగంగా బతుకుతెరువు కోసం హైదరాబాద్ పాత బస్తీలో మల్లేశం పడిన ఇబ్బందులను మల్లేశం పాత్రదారి, హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆరణ్యపై చిత్రీకరించారు. పువ్వులు అమ్మడం, ఆటో నడపడం తదితర పనులు చేసినప్పటికి వాటిలో ఆశించిన స్థాయిలో గడించకపోవడంతో నిరాశకు గురైన మల్లేశానికి తాగుబోతు రమేశ్ క్యారెక్టర్ చూపిన వీధి వ్యాపార మెళుకువలు, విజయం సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చేసిన హితబోధ తదితర అంశాలను చిత్రీకరించారు. స్టూడియో 99ఫిల్మీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రానికి ప్రొడ్యూసర్‌గా రాజు ఆర్, శ్రీ అధికారి, డైరెక్టర్‌గా రాజు శ్రీ వ్యవహరిస్తున్నారు. సంగీతం మార్క్ కే రాబిన్ అందిస్తుండగా పాటలను గోరేటి వెంకన్న, చంద్రబోస్ సమకూర్చారు. పెద్దింటి అశోక్ కుమార్ మాటలు రాయగా వెంకట్ సిద్దారెడ్డి ఇ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా ఆర్ట్ డైరెక్టర్‌గా జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయిందని మిగితాది పూర్తి చేసి జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం పేర్కొన్నది.
ఆసు యంత్రం మల్లేశం కుటుంబ సభ్యులతో వచ్చి తన బయోపిక్ సినిమా షూటింగ్‌ను చూశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







