వికలాంగుల పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా
- December 22, 2015
వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో ఇతరులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసినట్లయితే 1000 దిర్హామ్‌లు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే 4 బ్లాక్ పాయింట్స్ కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. దుబాయ్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వికలాంగులను గౌరవించాలనీ, వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు దుబాయ్ పోలీసులు. పది రోజులపాటు ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తారు. 'వారికి అండగా వుండండి, వారి ప్లేస్‌ని ఆక్యుపై చెయ్యొద్దు..' అనే స్లోగన్‌తో అవగాహన చేపట్టనున్నారు. 2012లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కేసులు 9,893 నమోదు కాగా, 2013లో 8,317, 2014లో 9,405, 2015లో 10,265 కేసులు కేవలం పదకొండు నెలల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నిబందనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించనున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







