రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన రాజసింహ
- December 22, 2015
తెలుగు సినిమా లో ప్రస్తుతం డైరెక్టర్ ల హవా కంటే, హీరోల హవా కంటే రైటర్ ల హవా బాగా నడుస్తోంది. ప్రస్తుతం కలం తో కుస్తీ పట్టిన రైటర్ లు అంతా మెగా ఫోన్ తో కుస్తీ పడుతున్నారు. దర్శకులు గా మారుతున్న ప్రతీ రచయితా ఒక అద్భుత డైరెక్టర్ గా మారడం విశేషం. నిర్మాతలు కూడా రైటర్ లు డైరెక్టర్ లు గా మారినపుడు వారి కోసం ఎక్కువ బడ్జెట్ లు పెట్టడానికి వెనకాడట్లేదు. కోన వెంకట్ - గోపీమోహన్ - బి.వి.ఎస్.రవి తదితర స్టార్ రైటర్ లతో పాటు పనిచేసిన రాజసింహ మంచి టాలంట్ ఉన్నరచయిత గా పేరొందాడు. సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప ఇప్పుడు తన దీర్ఘకాల కల అయిన "డైరెక్టర్" అవ్వడం అనే ఛాన్స్ రావడంతో అందిపుచ్చుకునే పనిలో పడ్డాడు. సందీప్ కిషన్ హీరోగా `ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్... ఒక్క అమ్మాయి తప్ప` అనే కొత్త సినిమా ని తెరకి ఎక్కిస్తున్నాడు. ఈ రోజే రామానాయుడు స్టూడియో లో ఈ సినిమా మొదలైంది. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని సందీప్ కిషన్ కి దగ్గరి వర్గాలు చెబుతున్నాయి. రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన రాజసింహ మంచి కథని ఎంచుకున్నాడు అని స్వయంగా చాలా కరక్షన్ లు చేసుకున్న తరవాత నే ఈ సినిమా ని ప్రకటించాడుఅంటున్నారు. డైరెక్టర్ వినాయక్ ముఖ్య అతిధి గా వచ్చిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఛోటా కె.నాయుడు కెమెరామెన్గా పనిచేస్తుండగా మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. టైగర్ తో ఫార్మ్ లో ఉన్న సందీప్ కి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







