విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్..
- December 22, 2015
దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్ లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్ లో ఉన్న ఫర్నిచర్స్ లో సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్లను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1.58కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లను సీజ్ చేశామని విచారణ చేపట్టినట్లు రాఘవన్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







