సానియా మీర్జా--హింగిస్ జోడి ఐటీఎఫ్ అవార్డు కైవసం..
- December 22, 2015
ఈ ఏడాది మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) వరల్డ్ చాంపియన్స్ అవార్డును భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళల మాజీ నెంబరవన్ మార్టినా హింగిస్(స్విట్టర్లాండ్)ల జోడి గెలుచుకుంది. 2015 మార్చిలో జత కట్టిన వీరిద్దరూ విశేషంగా రాణించి మొత్తం తొమ్మిది టైటిల్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. వరుసగా 22 మ్యాచ్‌లను సానియా జోడీ గెలుచుకోవడం విశేషం. దీంతో ఊహించినట్లుగానే ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ అవార్డుకు ఈ జోడీ ఎంపికైంది. కాగా, 2000లో మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఐటీఎఫ్ అవార్డును మార్టినా హింగిస్ గెలుచుకుంది. ఐటీఎఫ్ అవార్డును గెలుచుకోవడం పట్ల సానియా ఆనందం వ్యక్తం చేసింది. 'ఈ సంవత్సరం మాకు చాలా సంతృప్తిని మిగిల్చింది. అనుకున్నదాని కంటే చాలా సాధించాం. ఐటీఎఫ్ అవార్డును స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నా సక్సెస్ భారత్ లో చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది'అని సానియా పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







