బంగాళా దుంపల జ్యూస్...
- November 25, 2018
ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బంగాళదుంపలు ఒకటి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుని తింటుంటాము. ముఖ్యంగా, ఆలూ ఫ్రై, పులుసు, టమోటా వంటి కూరలను, వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
1. బంగాళాదుంపల జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.
2. ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ జ్యూస్‌ను తాగితే కీళ్ల నొప్పులు పోతాయి. బంగాళాదుంపల జ్యూస్‌తో మైగ్రేన్ నొప్పి మటుమాయమై పోతుంది.
3. శరీరానికి రోజువారీగా కావల్సిన బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాకుండా బంగాళదుంపను తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది.
4. ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు సపోర్ట్‌ను ఇస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
5. ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
6. పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది.
7. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
8. ఆలుగడ్డలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పోతాయి.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







