షాకింగ్ : అంబరీష్ ఇక లేరు
- November 25, 2018
ముఖ సినీనటుడు, కాంగ్రెస్ నేత అంబరీష్ (66)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 మే 29న అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించారు. నాగరాహవు సినిమాతో 1972లో సినీరంగ ప్రవేశం చేశారు. శాండిల్‌వుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన అంబరీష్ కన్నడ రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీనటి సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ అనంతరం రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ తరఫున కర్ణాటక ఎన్నికల్లో మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2013లో సిద్దరామయ్య కేబినెట్‌లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అంబరీష్ భార్య సుమలత సినీనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంబరీష్ మృతిపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంబరీష్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో అంబరీష్ మృతి చెందిన ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి