అబుధాబి గ్రాండ్ పిక్స్: సత్తా చాటిన హమిల్టన్
- November 26, 2018
అబుధాబి:వరల్డ్ ఛాంపియన్ లెవిస్ హమిల్టన్, పోల్ పొజిషన్ నుంచి సీజన్ ఎండ్లో ఘనవిజయాన్ని అందుకున్నాడు. అబుధాబి గ్రాండ్ పిక్స్ విజేతగా నిలిచాడు. ఐదవ ఎఫ్1 టైటిల్ని ఇప్పటికే సొంతం చేసుకున్న బ్రిటిష్ మెర్సిడస్ డ్రైవర్, తాజాగా ఫెరారీ సెబాస్టియన్ వెట్టెల్ని యస్ మెరినీ సర్క్యూట్లో ఢీకొని విజయం కైవసం చేసుకున్నాడు. ఇది ఈ సీజన్లో హమిల్టన్కి 11వ విజయం కాగా, తన కెరీర్లో 73వ టైటిల్. రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాప్పెన్ మూడో స్థానం దక్కించుకున్నాడు. వెటరన్ స్పానిష్ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో 11వ స్థానం దక్కించుకున్నాడు. ఫ్రెంచ్ డ్రైవర్ రొమైయన్ గ్రోస్జీన్ కారణంగా నికోల్ హుల్కెన్బర్గ్ కారు గాల్లోకి లేచి, బ్యారియర్స్లోకి దూసుకుపోయింది. మొత్తమ్మీద, అబుదాబీ గ్రాండ్ పిక్స్ అత్యంత ఘనంగా నిర్వహించబడింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







