పంజాబ్‌ నుండి పాక్ కు రహదారి మార్గానికి శంకుస్థాపన

- November 26, 2018 , by Maagulf
పంజాబ్‌ నుండి పాక్ కు రహదారి మార్గానికి శంకుస్థాపన

న్యూఢిల్లీ : పంజాబ్‌లో డేరాబాబా నానక్‌ నుండి పాకిస్తాన్‌లో గల కర్తార్‌పూర్‌కు నిర్మించే ఆరు కిలోమీటర్ల దూరం గల రహదారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌లు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. విభజన అనంతరం మూసివేసిన ఈ మార్గాన్ని పున:ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పున:ప్రారంభించినట్లు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా, బుధవారం పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కర్తార్‌పూర్‌లో శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది గురునానక్‌ 550 జయంతి సందర్భంగా నవంబర్‌ 2019 నాటికి కర్తార్‌పూర్‌లోని సాహిబ్‌ గురుద్వారాను సందర్శించేందుకు వీలుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాకిస్తాన్‌తో సంబంధాలు మరింత మెరుగుపడగలవని పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com