షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నుంచి భారీ రుణం తీసుకున్న ప్రభుత్వం
- December 02, 2018
ముంబయి: మహారాష్ట్ర అనగానే మనందరి మనస్సులో మెదిలేది షిరిడి. అహ్మద్‌నగర్ జిల్లాలో షిరిడి దేవాలయం ఉంది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు సాయిబాబా సహాయం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం షిరిడి సాయిబాబా దేవాలయం నుంచి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అహ్మద్‌నగర్ జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఉద్దేశించిన నిల్వాండే ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నగదు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ ఆఫ్ షిరిడి నుంచి ఎలాంటి వడ్డీలేకుండా రూ.500 కోట్ల రుణాన్ని తీసుకోవాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం దేవస్థానం ఛైర్‌పర్సన్, బీజేపీ నేత సురేశ్ హవారేను మహా సర్కార్ సంప్రదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోరిన నిధులను ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారు. వడ్డే లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలకు గతంలో ఎప్పుకూ కూడా ఇవ్వలేదు. మరోవైపు రుణాన్ని ఎప్పుడు తిరిగి చెల్లించేందుకు ఎలాంటి గడువు కూడా టెంపుల్ బోర్డు విధించలేదు.
రుణం ప్రతిపాదనకు ఫిబ్రవరి 1న ఆమోదం లభించగా.. రెండు విడతల్లో నిధులు విడుదల చేసేందుకు శనివారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ విశేషాలు.. దేవాలయం పేరిట ఇప్పటి వరకు రూ.2,100కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
ప్రతిరోజు రూ.2కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు రూ.700కోట్లకుపైనే ఇన్‌కమ్ వస్తోంది. ప్రతిరోజు 70వేలకు పైగా భక్తులు వస్తుండగా.. పండుగల సమయంలో 3.5లక్షల మంది సాయి భక్తులు వస్తారని అంచనా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







