ఆస్ట్రేలియా:ఒకరిని ఒకరు తోసుకున్న కౌశల్, బాబు గోగినేని..
- December 03, 2018
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశల్, బాబు గోగినేని ఆస్ట్రేలియాలో గొడవపడ్డారు. అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొన్న వీరిద్దరూ షో ముగింపు సమయంలో గొడవకు దిగారు. బిగ్‌బాస్ 2 లో కౌశల్ విజయం సాధించడం వెనుక కౌశల్ ఆర్మీ ముఖ్య పాత్ర వహించింది. అయితే ఈ కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని విమర్శలు గుప్పించారు. కౌశల్ ఆర్మీ విషయమై ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో శనివారం డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో కౌశల్, ఆయన భార్య నీలిమ, బాబు గోగినేని పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాబు గోగినేని మాట్లాడుతూ.. కౌశల్ బిగ్‌బాస్ షోకు రాకముందే ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారని, ఆ తరవాత ఆయన కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం ఆర్మీని నడిపించారని ఆరోపిస్తున్నారు. డబ్బులిచ్చి ఈ ఆర్మీని నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే బాబు గోగినేని ఆరోపణలను కౌశల్ భార్య నీలిమ ఖండించారు. ‘ఇట్ ఈజ్ ద మ్యాటర్’ అంటూ బాబుపైకి నీలిమ దూసుకెళ్లారు. దానికి బాబు గోగినేని కౌశల్ దంపతులపై విరుచుకుపడ్డారు. ముమ్మాటికీ అది ఫేక్ అని అన్నాడు. ఈ క్రమంలో కౌశల్, బాబు మధ్య వివాదం మరింత ముదిరింది. దాంతో ఒకరిని ఒకరు తోసుకుంటూ విమర్శలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







