హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ

- December 03, 2018 , by Maagulf
హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ

హైదరాబాద్: ఈనెల 7 వ తేదీ తర్వాత రాష్ట్రంలో వారసత్వ కుటుంబ పార్టీలు కనుమరుగవుతాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధుల విజయంకోసం ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...దేశంలో వారసత్వ కుటుంబ పాలన లేని ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. దేశంలో ఒక ప్రధాన పార్టీ ఐన కాంగ్రెస్ ఒక కుటుంబం చేతిలో చిక్కుకుని ఉందని, ఆపార్టీలో యోగ్యులైన వారు ఎందరో ఉన్నా వారసత్వరాజకీయాల వల్ల ఎదగలేకపోయారని మోడీ అన్నారు. యోగ్యత లేకున్నా వారసత్వంగా పార్టీని ప్రభుత్వాన్ని నడపాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని మోడీ విమర్శించారు. 
తెలంగాణా రాష్ట్రంలో కూడా కేసీఆర్ కుటుంబం చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయిందని, ఏపీలో టీడీపీ కానీ హైదరాబాద్ లోని ఎంఐఎం కానీ అన్నీ వారసత్వ కుటుంబ పార్టీలేనని మోడీ చెప్పారు. ఎంఐఎం కుటుంబ వారసత్వంతోపాటు మతాన్నికూడా నమ్ముకుందని, ప్రజలు వారసత్వ పార్టీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం,కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపిస్తే , చంద్రబాబునాయుడు స్వార్ధంకోసం కాంగ్రెస్ తో చేతులు కలిపారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని, రెండూ వ్యతిరేకంగా కనిపించినా ఆలోచనా విధానం ఒకటే అని మోడీ అన్నారు. 
తెలంగాణా ప్రజలకు హృదయ పూర్వక అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్నిప్రారంభించిన మోడీ ....సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఆదర్శం అని, పటేల్ పట్టుదల,కృషి వల్లే హైదరాబాద్ విమోచనం జరిగిందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com