నైజీరియాలో ఉపాధ్యాయుల ఆందోళనలు
- December 04, 2018
బూజ : నైజీరియాలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సరిపడ నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన బాట పట్టాయి. దీంతో, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యా యులు తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉత్తర నైజీరియాలోని సొకోటో నగరంలో ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ తీశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు కోసం తామెంతో కృషి చేశామని పలువురు ఉపాధ్యా యులు తెలిపారు. అయితే, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో నిరుపేద విద్యార్థుల డ్రాపవుట్ పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







