పొగమంచు: పలు విమానాల ఆలస్యం
- December 04, 2018
యూఏఈలో పలు చోట్ల పొగమంచు దట్టంగా అలముకోవడంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. అయితే ఎలాంటి క్యాన్సిలేషన్స్ లేకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం జెడ్డా నుంచి దుబాయ్ వెళ్ళాల్సిన విమానం 35 నిమిషాలు అలస్యమయ్యింది. మరో ఫ్లై దుబాయ్ విమానం బిష్తక్ నుంచి దుబాయ్ వెళ్ళాల్సి వుండగా ఇది గంట పాటు ఆలస్యమయ్యింది. ఇదిలా వుంటే, యూఏఈలో పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువ నమోదయ్యింది. ఎన్‌సిఎం (నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ) వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న కొద్ది రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే వుండబోతున్నాయి. సముద్రం మోడరేట్‌గా వుండే అవకాశముందని ఎన్‌సిఎం పేర్కొంది. వాతావరణం ఆహ్లాదకరంగానే కొనసాగుతుందని ఎన్‌సిఎం వివరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







