రేపటి నుండి మొదలు కానున్న 'ఎఫ్‌2' ఫన్

- December 04, 2018 , by Maagulf
రేపటి నుండి మొదలు కానున్న 'ఎఫ్‌2' ఫన్

హ్యట్రిక్ విజయాల దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). వెంకటేష్‌, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మూవీ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకులలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ .. మా చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాము అని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన అనిల్ రావిపూడి ' అవును..రేపటి నుంచి ఎఫ్2 ఫన్ మొదలవుతుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ రేపటి నుండి జోరందుకోనున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌తో మెహరీన్ జతకట్టారు. ముంబై ప్రాంతానికి సంబంధించిన కథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com