జాని మాస్టర్ రామ్ చరణ్ అభిమాని
- December 23, 2015
రామ్ చరణ్ నటించిన రచ్చ, నాయక్, ఎవడు, బ్రూస్ లీ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన జాని మాస్టర్ రామ్ చరణ్ గురించి ఆసక్తిక విషయం వెల్లడించారు. రామ్ చరణ్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఎంతో మంచి వాడని, తనకు కష్ట సమయంలో చేసిన సహాయం గురించి ఇటీవల ఓ ఒంటర్వ్యూలో జాని మాస్టర్ వెల్లడించారు. తన భార్య ప్రెగ్నెన్సీ సమయంలో సమయంలో చాలా ప్రాబ్లం అయింది, హాస్పటల్ ఖర్చు భారీగా అయింది. ఆ సమయంలో రామ్ చరణ్ నాకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. రామ్ చరణ్ ఒక మాట చెప్పగానే అపోలో ఆసుపత్రిలో నా భార్య, కొడుకు విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు అని జానీ మాస్టర్ వెల్లడించారు. రామ్ చరణ్ తన అనుకున్న వారి కోసం ఎలాంటి సహాయం అయినా చేయడానికి అయినా సిద్దంగా ఉంటారు అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. తనతో కలిసి పని చేసే వారితో రామ్ చరణ్ మంచి రిలేషన్ ఫిప్ మెయింటేన్ చేస్తారు. అందరినీ కలుపుకుపోతారు. ఆయనకు ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు చాలా సపోర్టుగా ఉంటారు అని తెలిపారు. దర్శకుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లకు తాను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. రాజమౌళి గారి వల్ల తాను వర్క్నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు వర్క్ విషయంలో నన్ను చాలా బాగా గైడ్ చేసారు. రామ్ చరణ్ నాకు పని ఇచ్చారు....అంటూ ఈ ముగ్గురి విషయంలో జానీ మాస్టర్ కాస్త ఎమోషనల్ గా స్పందించారు
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







