48 గంటలు మందు బంద్

- December 05, 2018 , by Maagulf
48 గంటలు మందు బంద్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఆఖరు అంకానికి చేరింది. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియబోతుండడంతో.. అభ్యర్థులు నియోజకవర్గంలో ఆఘమేఘాలమీద పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు. ఈ నెల 7న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో.. నియమావళి ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలి. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనున్నందున ఆయా చోట్ల ఇవాళ సాయంత్రం 4 గంటలకే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. మిగతా 106 చోట్ల 5 గంటల తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లు బంద్ అవుతాయి.

అలాగే.. ఈ 48 గంటలు బల్క్‌ SMSలపై కూడా నిషేధం ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు 12 రకాల ప్రత్యామ్నాయ కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పాస్ ‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పోస్టాఫీస్‌ పాసు పుస్తకం, పాన్‌ కార్డు లాంటివి చూపించి ఓటు వెయ్యొచ్చు. అటు, ప్రచార గడువు ముగిసినప్పటి నుంచి మద్యం అమ్మకాలు కూడా బంద్ అవుతాయి. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసాక.. మళ్లీ వైన్ షాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకూ డ్రై డే ఉంటుంది. అలాగే ఎవరైనా మద్యం సేవించి ఓటు వేయడానికి వస్తే.. ఈసారి కేసులు కూడా నమోదు చేయబోతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com