రాజకీయం జాతీయం

ఎన్నికలొచ్చాయి, ఎలుకలన్నీ

ఏనుగులయ్యాయి!

ఏరుగా పారెను సారాయి,

'ఓట్లు' కోసం నోట్లు,

నోట్ల కోసం ఓట్లు!

ఎందుకు పనికిరాని ప్రజాస్వామ్యం,

నోటంటే ఓటు, చట్టసభలో సీటు,

రాజుకావాలని రోజు, రోజు కలలు,

ఎన్నికలలో? ఎన్నికలలో!

పట్టపగలే దోపిడీ దొంగలున్న,

నిరక్షరాశ్యత నిండిన భారతం,

నిత్యం హత్యలు,నిలువు దోపిడీల భాగోతం

రేపటికెన్నో 'రేపు'ల రాద్ధాంతం

నోట్ల కట్టలతో,ఓట్లు కొనే బడాబాబులు!

రాజకీయం రమణీయం

జాతీయం మరెంతో కమనీయం!

ఎన్నికలలో - ఎన్నికలలో!

- డా|| కోడి వెంకట రామారావు, అల్ ఐన్, యూఏఈ 

Back to Top