700 మంది ఇన్‌మేట్స్‌కి క్షమాభిక్ష

- December 08, 2018 , by Maagulf
700 మంది ఇన్‌మేట్స్‌కి క్షమాభిక్ష

కువైట్‌ సిటీ: రిఫార్మ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ సెంటెన్సెస్‌ ఎగ్జిక్యూషన్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ, మేజర్‌ జనరల్‌ ఫరాజ్‌ అల్‌ జాబి, 600 నుంచి 700 మంది కువైటీ మరియు వలస ఇన్‌మేట్స్‌కి ఈ ఏడాది అమ్నెస్టీ లభించే అవకాశం వుందని చెప్పారు. 'అవర్‌ హ్యాండి వర్క్స్‌' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌక్‌ షర్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఫరాజ్‌ అల్‌ జాబి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్‌మేట్స్‌ కోసం ప్రిజన్‌లో అప్లయిడ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేయాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఇన్‌మేట్స్‌కి రా మెటీరియల్‌ని సప్లయ్‌ చేస్తుందనీ, తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి వీలవుతుందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com