కోర్టు హియరింగ్ తర్వాత జైలుకి మికా సింగ్
- December 08, 2018
భారత సింగర్ మికా సింగ్‌పై సెక్సువల్ హరాష్‌మెంట్ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని రోజులు మికా సింగ్, పోలీసుల కస్టడీలో వుంటారన్నదానిపై స్పష్టత లేదు. 17 ఏళ్ళ బ్రెజిలియన్ బాలికపై మికా సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. న్యాయస్థానంలో హాజరు పరిచే నిమిత్తం అబుదాబీకి తీసుకొచ్చారు పోలీసులు మికాసింగ్‌ని. మికాసింగ్‌ని అరెస్ట్ చేశారనీ, అతని విడుదల కోసం తాము ప్రయత్నిస్తున్నామనీ యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవదీప్‌సింగ్ సూరి చెప్పారు. అయితే, గురువారం రాత్రి మికాసింగ్‌ని విడుదల చేసినట్లు ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







