బ్రిటన్:'గోల్డెన్ వీసా' రద్దు
- December 08, 2018
లండన్: బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్ వీసా (టైర్-1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రక టించింది. గోల్డెన్ వీసా దుర్విని యోగం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నా మనీ, శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలకు చెందిన విదేశీయులు ఈ గోల్డెన్ వీసా ద్వారా బ్రిటన్లో స్థిరపడుతున్నారు. ఈ గోల్డెన్ వీసాలో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉన్నాయి. బ్రిటన్లో 2 మిలియన్ పౌండ్లు ( రూ.18,12,55,173 ) పెట్టుబడి పెట్టే విదేశీయులు తొలుత 40 నెలలు ఉండేందుకు అధికారులు అనుమతిస్తారు. దీన్ని మరో రెండేండ్ల పాటు పొడిగించుకోవచ్చు. వీరికి ఐదేండ్ల అనంతరం బ్రిటన్లో శాశ్వత నివాస హోదా(ఐఎల్ఆర్)ను కల్పిస్తా రు. ఈ పెట్టుబడిదారులు తమ భార్యతో పాటు 18 ఏండ్ల లోపు ఉండే తమ పిల్లల్ని బ్రిటన్కు తీసుకురా వచ్చు. అలాగే బ్రిటన్లో 5 మిలియన్ పౌండ్లు ( రూ.45,30,11,900 ) పెట్టుబడి పెట్టేవారికి మూడేండ్లలో 10 మిలియన్ పౌండ్లు ( రూ.90,68,96,741 ) పెట్టుబడి పెడితే రెండేండ్లలో శాశ్వత నివాస హోదా లభిస్తోంది.
గోల్డెన్ వీసా కింద మొదటి కేటగిరి వ్యాపారవేత్తలు ఆరేం డ్ల తర్వాత, మిగిలినవారు ఐదేండ్ల అనంతరం బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







