హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించిన క్యుఓసి
- December 08, 2018
దోహా: ఖతార్ ఒలింపిక్ కమిటీ (క్యుఓసి), 'ఫిట్‌నెస్ అండ్ హెల్త్ 2018' అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఖతార్ డయాబెటిస్ అసోసియేషన్‌తో కలిసి అస్పైర్ పార్క్‌లో నిర్వహించింది. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో 200 మందికి పైగా ప్రజలు తమ బరువు, ఎత్తు, బ్లడ్ ప్రజర్, డయాబెటిస్‌కి సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. డైటీషియన్స్, వీరికి కొన్ని సలహాలు, సూచనలు చేయడం జరిగింది. వెయిట్ లాస్, డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడం, బీపీని అదుపులో వుంచుకోవడంపై వైద్యులు సూచనలు చేశారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ (బిపి) సమస్యలు మనిషిని జీవితాంతం వెంటాడుతాయనీ, చిన్న చిన్న ఆహారపు అలవాట్లు, రోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువుని అదుపులో పెట్టుకుంటే, డయాబెటిస్ - బీపీ అదుపులో వుంచుకోవచ్చని వైద్యులు ఈ సందర్భంగా చెప్పారు. హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు విలువైన సూచనలు చేశారని వారంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







