త్వరలో వాట్సాప్ వీడియోకాలింగ్ సదుపాయం
- December 23, 2015
ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే మెసేజ్ సర్వీసింగ్ యాప్ వాట్సాప్. గత సెప్టెంబర్ నెల నాటికి ఈ యాప్‌ని ఉపయోగించే వారి సంఖ్య 900 మిలియన్లకు చేరింది. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు. అయితే.. ప్రజలు ఇంతలా ఉపయోగిస్తున్న ఈ యాప్‌లో స్కైప్, హ్యాంగ్‌అవుట్స్‌లో లాగా వీడియోకాలింగ్ సదుపాయం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ.. త్వరలోనే వాట్సాప్‌లో వీడియోకాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందట. త్వరలో విడుదల చేయనున్న ఐవోఎస్ వర్షన్‌లో ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఒక జర్మన్ వెబ్‌సైట్ ధ్రువీకరించింది. ఐవోఎస్ వర్షన్ వీడియోకాలింగ్‌ని టెస్ట్ చేస్తుండగా తీసిన కొన్ని స్క్రీన్‌షాట్స్‌ని ఆ వెబ్‌సైట్ విడుదల చేసింది. ఈ స్క్రీన్‌షాట్స్ ఆధారంగా.. వీడియో కాల్ మాట్లాడుతూనే ఫొటోలు కూడా తీసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







