యూఏఈలో అగ్ని ప్రమాదం: ఏడేళ్ళ చిన్నారి మృతి
- December 12, 2018
షార్జాలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాధిత చిన్నారిని అరబ్ జాతీయురాడిగా గుర్తించారు. అగ్ని ప్రమాదం కారణంగా బాధిత చిన్నారి ఎక్కువగా పొగ పీల్చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, ప్రాణాల్ని కాపాడలేకపోయారు. షార్జా సివిల్ డిఫెన్స్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉదయం 11.03 నిమిషాల సమయంలో అందుకుంది. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కులాయా ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం ఐదో ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో ఫ్లాట్‌లోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయింది. చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగానే వున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







