జజాన్‌ సబ్యాలో తొలి వర్చువల్‌ స్కూల్‌

- December 12, 2018 , by Maagulf
జజాన్‌ సబ్యాలో తొలి వర్చువల్‌ స్కూల్‌
జెడ్డా: సబ్య డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - జజాన్‌లో తొలి వర్చువల్‌ స్కూల్‌ని స్పెషల్‌ నీడ్స్‌ విద్యార్థుల కోసం ప్రారంభించింది. సబ్య గవర్నరేట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ హనన్‌ బింట్‌ అలి అల్‌ హాజిమి ఈ స్కూల్‌ని ప్రారంభించారు. అల్‌ హాజిమి మాట్లాడుతూ, స్పెషల్‌ నీడ్స్‌ చిన్నారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు ఈ స్కూల్‌ పరిష్కారం చూపుతుందని అన్నారు. ఇదిలా వుంటే ఇటీవలే సౌదీ ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ, తమ అన్ని డిజిటల్‌ టెక్స్‌ట్‌బుక్స్‌ని వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులోకి వుంచింది. డిజిటల్‌ టెక్నాలజీని ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో విస్తరించే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. సౌదీ అరేబియా, లిటరసీ రేటుని 94.4 నుంచి 100 శాతానికి పెంచే దిశగా ఇటీవలే ప్రతిజ్ఞ చేసింది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com