జర్మనీ: రోడ్డుపై టన్ను చాక్లెట్ లీక్..
- December 12, 2018
జర్మనీలో ఒక టన్ను చాక్లెట్ స్థానికంగా ఒక రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేసిందని అధికారులు చెప్పారు.ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ట్యాంకులో రవాణా అవుతున్న చాక్లెట్ పశ్చిమ జర్మనీలోని వెస్టొనెన్ పట్టణంలోని ఒక రోడ్డుపై సోమవారం సాయంత్రం లీకయ్యింది. రోడ్డుపై తారుతో లేయర్ వేసినట్లుగా చాక్లెట్ పరచుకుంది. వెంటనే అది గట్టిపడిపోయింది.
దాదాపు 10 చదరపు మీటర్లు (108 చదరపు అడుగులు) మేర పరచుకున్న చాక్లెట్‌ను తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సిబ్బంది కలసి గడ్డపారలు, వేడి నీళ్లు, వేడిగాలిని వెదజల్లే బ్లోయర్లను ఉపయోగించారు.
ఈ తియ్యని ఎమర్జెన్సీ కార్యక్రమంలో చాక్లెట్ ఫ్యాక్టరీ డ్రీమిస్టెర్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.
''ఇది గుండెలు పిండేసే సంఘటన. అయినప్పటికీ ఈ క్రిస్‌మస్‌కు చాక్లెట్ల కొరత ఉండకపోవచ్చు'' అని అగ్నిమాపక శాఖ సిబ్బంది అన్నారు.
బుధవారం నాటికల్లా తమ ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని డ్రీమిస్టెర్ స్థానిక మీడియాకు చెప్పింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







