రోబో కు షాక్ ఇచ్చిన కేసీఆర్
- December 13, 2018
'దేవుడు శాసిస్తే అరుణాచలం పాటిస్తాడు'.. కానీ తెలంగాణలో కేసీఆర్ శాసించాడు.. 'నాన్న పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది' అనే రజనీకాంత్ చెప్పనట్టు గానే కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఒంటరి సృష్టించిన విజృంభణ ప్రతిపక్షాలనే కాదు.. తలైవా రజనీకాంత్ ను కూడా దెబ్బ తీసింది.
రజనీకాంత్ నటించిన రోబో 2.0 గురించే మనం చెప్పుకునేది. రోబో 2.0 మొన్నటి ఎన్నికల ఫలితాల దెబ్బకు సినిమా హాళ్లు అన్ని వెలవెలబోతున్నాయి. ఉత్కంఠగా సాగిన ఎన్నికలు కావడం, ఇంకో పక్క కేసీఆర్ ఇతర పార్టీలకు ఇచ్చిన షాక్ వెరసి మొత్తం మీద ఈ ఎఫెక్ట్ రోబో 2.0 కలెక్షన్లపై పడింది.
అసలే కాస్త, లాస్ లో నడుస్తున్న సినిమా కావడంతో రోజురోజుకు కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల హడావుడిలో సినిమాను ఫ్యాన్స్ పట్టించుకోవడం మానేశారు. అయితే ఫలితాలు అనంతరం సాయంత్రం ఫస్టు షో, సెకండ్ షోకైనా ప్రేక్షకులు వస్తారానుకుంటే ఆ పని జరుగలేదని సినిమా వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ హవాను ఇతర పార్టీలను ట్రోల్ చేయడంలోనే సోషల్ మీడియా అంతా బీజీబీజీగా ఉండటంతో ఎవరూ కూడా సినిమా వంక తొంగి చూడలేదు.
ఇప్పటికి వరకు పెట్టిన ఖర్చులో సగం మాత్రమే వసూళ్లు రాబట్టిన రోబో 2.0కు మరింత బ్రేక్ రావాలంటే దేవుడు దిగిరావాల్సిందేనని సినీప్రియులు చర్చించుకుంటున్నారు. మరి సంక్రాంతి వరకూ ఈ సినిమా రన్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్న నిర్మాతలు ఈ సినిమా లాంగ్ రన్లో ఏమవుతుందనే టెన్షన్లో ఉన్నారట. మరీ సినిమా వసూళ్లు సాధిస్తుందో లేదో మరీ చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







