అమెరికా:భారతీయునికి తొమ్మిదేళ్లు జైలు

అమెరికా:భారతీయునికి తొమ్మిదేళ్లు జైలు

అమెరికా:లైంగిక దాడి ఆరోపణలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్షపడింది. తమిళనాడుకు చెందిన ప్రభు రామమూర్తి 2015 సంవత్సరం నుంచి H-1B వీసాపై అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గానూ అతడిపై కేసు నమోదైంది. లాస్ వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న విమానంలో పక్క సీటులోని 23 ఏళ్ల యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. నిద్రలో ఉన్న ఆమెపై లైంగిక దాడి జరిపాడు. అతడి చేష్టలతో నిద్ర మేల్కోని చూసుకునే సరికి తన ప్యాంట్, షర్ట్ బట్టన్ తీసి ఉన్నాయని కోర్టుకు తెలిపింది. పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. దీంతో డెట్రాయిట్ ఫెడరల్ కోర్టు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, స్వేచ్చగా ప్రయాణించే హక్కు ఉంటుందని, తోటి మహిళా ప్రయాణికురాలితో నిందితుడు ప్రవర్తించిన తీరు క్షమించరానిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Back to Top