శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం
- December 14, 2018
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.
సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్‌పోర్టులు, వీసాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే.. ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు సిబ్బంది నకిలీ వీసాలతో చెక్కేసేవారితో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారు. ఎయిర్‌లైన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







