ఉన్మాది మూవీ ట్రైలర్ విడుదల
- December 16, 2018
ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ఉన్మాది. . ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ - "ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. గుంటూరు జిల్లాలోపరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేశాం. 8ఫైట్స్, 5 సాంగ్స్‌తో సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. టీజర్‌ను విడుదల చేశాం. సమాజంలో ఆడ పిల్లలపై జరగుతున్న అఘాయిత్యాలపై తెరకెక్కిన కథాంశం ఇది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం" అన్నారు.
టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్‌పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్, ఎడిటర్: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ: సామ్రాట్, జోజో, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి, క్రియేటివ్ డైరెక్టర్ : రాఘవ, నిర్మాత: ఎన్.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ను మీరూ చూడండి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







