ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తల్లి కన్నుమూత
- December 16, 2018
ముంబై: బాలీవుడ్ తొలితరం నటుడు వినోద్ ఖన్నా తొలి భార్య గీతాంజలి ఖన్నా(70) కన్నుమూశారు. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే, గత కొంతకాలంగా ఆమె గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన గీతాంజలిని శనివారం రాత్రి అలీబాగ్ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ ఖన్నా, రాహుల్ ఖన్నాలు ఆమె కుమారులే. మూత్రాశయ కేన్సర్‌తో బాధపడుతున్న వినోద్ ఖన్నా గతేడాదే మృతి చెందారు. గీతాంజలి-వినోద్ ఖన్నాలు 1971లో వివాహం చేసుకున్నారు. 1985లో విడిపోయారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







