ఆటో వర్క్ షాప్ నుండి 60 కిలోల హెరాయిన్ స్వాధీనం
- December 17, 2018అబుదాబీలోని ఓ ఆటో వర్క్ షాప్ నుంచి 60 కిలోల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. 'డెత్ స్టార్మ్' పేరుతో నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ఈ హెరాయిన్‌ని పట్టుకోగలిగారు. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వర్క్ షాప్‌లోని 'యూజ్డ్ కార్స్' తాలూకు డోర్స్‌లో ఈ హెరాయిన్‌ని గుర్తించారు అధికారులు. అరెస్ట్ చేసిన అనుమానితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వర్క్ షాప్ పార్టనర్ ఒకరు కాగా, మరొకరు ఇన్వెస్టర్, మిగిలిన వ్యక్తి విజిటర్. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అబుదాబీ పోలీస్ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైసరెక్టరేట్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌ని గ్రేట్ సెక్యూరిటీ అఛీవ్‌మెంట్‌గా అభివర్ణించారు. అరెస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు కల్నల్ తాహెర్ ఘరీబ్.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్