రోడ్డుపై పడ్డ డబ్బు..క్షణాల్లో మాయం
- December 17, 2018
న్యూజెర్సీ: నగర ప్రాంత నడి రోడ్డుపై ఈ రోజు ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. భారీ నగదుతో వెళుతున్న ఓ ట్రక్ లో నుంచి డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వొక్కసారిగా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. వాహనదారులు తమ కార్లను పక్కకు ఆపి రోడ్డుపై పడ్డ డబ్బులను ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అక్షరాలా.. రూ. 2.15 కోట్లు క్షణాల్లో మాయమైపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రక్ తలుపులు సరిగా బిగించకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు.
దారిలో వొక తలుపు తెరుచుకుని డబ్బు రోడ్డుపై పడిపోయాయని తెలిపారు. డబ్బును తీసుకున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







