షార్జా పోలీస్ స్టేషన్లలో 'ఐరిస్' స్కాన్
- December 24, 2015
ఇక నుంచి షార్జా పోలీస్ స్టేషన్లలో ఐరిస్ స్కాన్ అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో నిందితుల్ని గుర్తించడం తేలికవుతుందని పోలీసులు అంటున్నారు. వివిధ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల వద్ద సెక్యూరిటీ చెక్ కోసం ఐరిస్ స్కాన్ వాడుతుండడం జరుగుతోంది. ఈ విధానాన్ని పోలీస్ స్టేషన్లలోనూ అమల్లోకి తీసుకురావడం ద్వారా నేరస్తుల్ని గుర్తించడం తేలికవుతుంది. ఒక్కోసారి పాస్‌పోర్ట్ పోయిందంటూ, తప్పుడు ధృవపత్రాలతో కొందరు పాస్‌పోర్టుల్ని పొందుతున్నారు. అలాంటివాటిని ఐరిస్ స్కాన్ ద్వారా నివారించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఐరిస్ స్కాన్ విధానంలో, ఓ పరికరంతో కనుగుడ్లను స్కాన్ చేస్తారు. దాన్ని మేథమెటికల్ కోడ్‌లో భద్రపరుస్తారు. అనుమానితులు పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు వారి ఐరిస్‌ని సేకరించి, తమ వద్దనున్న డేటాతో సరిపోల్చుతారు. ఈ విధానం ద్వారా నేరస్తులు తేలిగ్గా పట్టుబడతారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







