సోలార్ పవర్ కోసం జాయింట్ వెంచర్
- December 24, 2015
ఖతార్ పెట్రోలియం (క్యుపి), ఖతార్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కంపెనీ (క్యుఇడబ్ల్యుసి) సంయుక్తంగా విద్యుత్ ఉత్పాదకతను ప్రారంభించనున్నాయి సోలార్ పవర్ ద్వారా. ఇందులో క్యుపి 40 శాతం కలిగి ఉంటుంది. క్యుఇడబ్ల్యుసి 60 శాతం వాటా కలిగి ఉంటుంది. క్యుపి ప్రెసిడెంట్ సాద్ షెరిదా అల్ కాబి, క్యుఇడబ్ల్యుసి మేనేజింగ్ డైరెక్టర్ ఫహాద్ హమాద్ అల్ మొమానది 'ఎంఓయు'పై సంతకం చేశారు ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని సమక్షంలో. కాలుష్యం లేకుండా, సౌర శక్తి ద్వారా విద్యుత్‌ని తయారు చేసే ఈ విధానం, ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా రూపొందుతుందనీ, దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవుతుందని షేక్ అబ్దుల్లా చెప్పారు. క్యుఇడబ్ల్యుసి, ఇతర సంస్థలతో కలిసి 8,600 మెగావాట్ల నుంచి 11 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని 2018 నాటికి సాధించే లక్ష్యంతో దూసుకుపోతుందని ఆ సంస్థ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







