కాపర్‌ దొంగతనం: ఒకరి అరెస్ట్‌

- December 25, 2018 , by Maagulf
కాపర్‌ దొంగతనం: ఒకరి అరెస్ట్‌

కువైట్‌:ఇన్‌స్టలేషన్స్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ అధికారులు, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అహ్మది పోలీస్‌ స్టేషన్‌కి నిందితుడ్ని అప్పగించారు. నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు 57 పీసెస్‌ ఆఫ్‌ కాపర్‌ని దొంగిలించినట్లు తెలుస్తోంది. బుర్గాన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ విసినిటీలో పెట్రోలింగ్‌ సందర్భంగా ఈ అరెస్ట్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల్ని చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతనిపై పలు దొంగతనం కేసులు వున్నట్లు తేలింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com