'వినయ విధేయ రామ' ట్రైలర్ కు టైం ఫిక్స్
- December 26, 2018
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. కానీ నటించిన సినిమాలు ఒకటీ రెండు తప్ప అన్ని సూపర్ హిట్ కావడం విశేషం. ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'సినిమా ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది..ఇది రాంచరణ్ కెరీర్ లో మగధీర తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం రాంచరణ్ మాస్ దర్శకులు బోయపాటి శ్రీను తో 'వినయ విధేయ రామ' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి చాలా టైమ్ పట్టింది..అంతే కాదు చాలా రోజుల వరకు 'వినయ విధేయ రామ' కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాకుండా చూశారు.
ఇక సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేసిన తర్వాత వరుసగా అప్ డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ వచ్చాయి. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే..సినిమాలో ఓ రేంజ్ లో యాక్షన్ సీన్లు ఉంటాయని తెలిసిపోతుంది.
గుర్రంపై రాంచరణ్ స్టైల్ గా పోజు ఇచ్చారు. అంతే కాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిరథ మహారథులు వస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి తో పాటు రాంచరణ్ ని ఎంతో అభిమానించే స్నేహితుడు..సహ నటుడు ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకి వస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ వేదికపై రాత్రి 9 గంటలకి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ను బోయపాటి శ్రీను కట్ చేసినట్టుగా తెలుస్తోంది. కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్ .. ప్రశాంత్ .. స్నేహా కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







