సల్వా రోడ్డుపై మసైయీద్ ఇంటర్‌ఛేంజ్ వద్ద డైవర్షన్
- December 26, 2018
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్గల్', సల్వా రోడ్డు వెస్ట్ బౌండ్ క్యారేజ్ వేపై మెసైయీద్ ఇంటర్‌ఛేంజ్ (ఎగ్జిట్ 24) వద్ద తాత్కాలిక డైవర్షన్‌ని ప్రకటించింది. వారం రోజులపాటు ఈ డైవర్షన్ అమల్లో వుంటుంది. గురువారం నుంచి ఈ డైవర్షన్ అందుబాటులోకి వస్తుంది. తాత్కాలిక డైవర్షన్ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా వాహనదారులకు అధికారులు సూచించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి ఈ డైవర్షన్‌ని డిజైన్ చేశారు. సల్వా రోడ్డుపై వెస్ట్ బౌండ్ మీదుగా బుసుమ్రా వైపు వెళ్ళే ట్రాఫిక్, సమాంతరంగా వున్న సర్వీస్ రోడ్డు వైపుకు మళ్ళిస్తారు. 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డులో ప్రయాణించి తిరిగి సల్వా రోడ్డులో ఈ ట్రాఫిక్ కలుస్తుంది. లేన్స్ సంఖ్యను 3 నుంచి 2కి సర్వీసు రోడ్డుపై తగ్గించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







