వెండితెరపై 'మిసైల్ మేన్' బయోపిక్!
- December 26, 2018
బాలీవుడ్‌లోనేకాదు సౌత్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఆటగాళ్ల లైఫ్ స్టోరీల గురించి రకరకాల సినిమాలు అభిమానులను అలరించాయి. బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో మిసైల్ మేన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్‌కలాం జీవితం మీద సినిమాని సౌత్‌తోపాటు హిందీలోనూ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కలాం రోల్‌లో బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ నటిస్తాడని సమాచారం. కొద్దిరోజుల కిందట ఫిల్మ్ మేకర్స్.. అనిల్‌కపూర్‌ని కలిసి స్క్రిప్ట్ వినిపించడం, ఆయనకు నచ్చడంతో ఈ బయోపిక్ చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్‌గా ప్రకటన రానుంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళడం ఖాయం. అనిల్ సుంకర- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నారు. కలాం జీవిత చరిత్రపై రాజ్ చెంగప్ప రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







