ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 73 మంది మహిళల అరెస్ట్‌

- December 26, 2018 , by Maagulf
ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 73 మంది మహిళల అరెస్ట్‌

రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన, పబ్లిక్‌ మొరాలిటీని దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో 73 మంది మహిళల్ని అరెస్ట్‌ చేశారు అధికారులు. బౌషర్‌లో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. మస్కట్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, పబ్లిక్‌ మోరల్‌ని కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టింది. బౌషర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, డిసెంబర్‌ 25న తనిఖీలు నిర్వహించి, అరెస్టులు చేయడం జరిగింది. ఏ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిందితులు పాల్పడ్డారనే విషయమై స్పష్టత రావాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com