యూఏఈలో న్యూ ఇయర్‌ హాలీడే ప్రకటన

- December 27, 2018 , by Maagulf
యూఏఈలో న్యూ ఇయర్‌ హాలీడే ప్రకటన

యూ.ఏ.ఈ:ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, న్యూ ఇయర్‌ హాలీడేని ప్రకటించింది. పబ్లిక్‌ సెక్టార్‌ కోసం ఈ హాలీడేని ప్రకటించారు. ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. అథారిటీ చేసిన ప్రకటన ప్రకారం, జనవరి 1వ తేదీన.. అంటే, మంగళవారం అన్ని మినిస్ట్రీలు, ఫెడరల్‌ ఎన్‌టైటీస్‌కి సెలవు దినం. ఆ రోజు అన్ని కార్యాలయాలూ మూసివేయబడ్తాయి. మరుసటి రోజున, యధాతథంగా అన్ని కార్యాలయాలు తిరిగి పనిచేస్తాయి. ఈ విషయాన్ని పేర్కొంటూ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు కూడా తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com