రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి

- December 27, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి

మస్కట్‌:విలాయత్‌ ఆఫ్‌ మహూత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ఐదుగురు ఒమనీయులు, ఇద్దరు జాతీయులైన వలసదారులు వున్నారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. బుధవారం ఈ ఘటన జరిగిందనీ, ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com