న్యూ ఇయర్ ఈవ్: దుబాయ్‌లో రోడ్ క్లోజర్స్ ఇవే
- December 31, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో కొన్ని చోట్ల రోడ్ క్లోజర్స్‌ని తాత్కాలికంగా ప్రకటించింది. 2 మిలియన్ పీపుల్ ఈ వేడుకల్లో పాల్గొంటారన్న అంచనాల నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎలాంటి ప్రమాదాలకూ ఆస్కారం లేకుండా ఈ చర్యలు చేపట్టారు. దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా వంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు ముందుగానే బయల్దేరాల్సి వుంటుందని ట్రాఫిక్ అధికారులు సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి రోడ్ క్లోజర్స్ అమల్లో వుంటాయి. అల్ అసాయెల్ స్ట్రీట్, హ్యాపీనెస్ స్ట్రీట్, ఫైనాన్షియల్ సెంటర్ రోడ్, అల్ సుకౌక్ స్ట్రీట్లు ఇందులో వున్నాయి. కొన్ని రోడ్స్‌లో క్లోజర్స్ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతోంటే, ఇంకొన్ని 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇదిలా వుంటే, బుర్జ్ ఖలీఫా సహా పలు ప్రాంతాలకు న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఔత్సాహికులు తరలి వెళుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







